డెంగీపై అవగాహన తప్పనిసరి

ABN , First Publish Date - 2020-05-17T10:47:11+05:30 IST

ప్రతిఒక్కరూ డెంగీపై అవగాహన పెంచుకోవాలని వైద్యాధికారి జి.సంతోషికుమారి అన్నారు.

డెంగీపై అవగాహన తప్పనిసరి

బెలగాం, మే 16: ప్రతిఒక్కరూ డెంగీపై అవగాహన పెంచుకోవాలని వైద్యాధికారి జి.సంతోషికుమారి అన్నారు. శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లకు డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామీణ ప్రజలకు డెంగ్యూపై అవగాహన పెంచా లని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ పుష్ప, స్టాఫ్‌నర్సు భారతి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


శృంగవరపుకోట రూరల్‌:  కొట్టాం పీహెచ్‌సీలో  వైద్యాధికారి ఎం. ఫణీంద్ర మాట్లాడుతూ... డెంగీపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాల న్నారు. పరిసరాలు పరిశ్రుభంగా  ఉంచాలని, ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు. 


వేపాడ: స్థానిక పీహెచ్‌సీలో సీహెచ్‌వో రమేష్‌బాబు మాట్లాడుతూ  పాతబడిన నీటి ట్యాంకులు, టైర్లు, కొబ్బరి చిప్పలు ఇళ్ల మధ్య ఉంచకూడ దన్నారు. దీని వల్ల డెండీ ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. దోమ తెరల ను విధిగా వినియోగించాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. 


కొత్తవలస రూరల్‌: వియ్యంపేట పీహెచ్‌సీలో వైద్యాధికారి ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. డెంగీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు. నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఎంపీహెచ్‌ఈవో గోవిందరాజు, హెల్త్‌ అసిస్టెంట్‌ ఎల్‌.సత్యారావు, ఏఎన్‌ఎంలు వరలక్ష్మి, జ్యోతి, తులసీలక్ష్మి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-17T10:47:11+05:30 IST