అందుబాటులో లేని మాస్కులు

ABN , First Publish Date - 2020-03-19T10:23:34+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలో లేకున్నా ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు, మీడియాల్లో వస్తున్నకథనాలతో

అందుబాటులో లేని మాస్కులు

బయట షాపుల్లో భారీ ధరలు


(పార్వతీపురం)

కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలో లేకున్నా ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు, మీడియాల్లో వస్తున్నకథనాలతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. కరోనానుంచి రక్షణ కోసమంటూ మాస్కుల కోసంమందుల షాపులవద్దకు పరుగుతీస్తున్నారు. ఇదే అదనుగా షాపుల యజమానులు నిన్నమొన్నటి వరకు రూ. 8లున్న మాస్కును రూ. 30కు విక్రయించి దోపిడీ చేస్తున్నారు. అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని జనాలు కోనుగోలు చేస్తున్నారు. కరోనా ప్రభావం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు తాకిందని, ఈ జిల్లాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తుండడంతో ఈపరిస్థితి నెలకొంటొంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకునిమాస్కులను కావాలనే వ్యాపారులు బ్లాక్‌ చేస్తున్నారని, మరీ ఒత్తిడిచేస్తే వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీ పురం, సాలూరు, బొబ్బిలి, విజయనగరం, తదితర పట్టణాల పరిధిలో మాస్కులు లభించడంలేదు.


సర్జికల్‌ మాస్కులే..

ప్రస్తుతం వ్యాపారులు విక్రయిస్తున్నవి వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో ఉపయోగించేవి సర్జికల్‌ మాస్కులు మాత్రమే. వీటినే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.  ఇవి. కొన్నిగంటలే పనిచేస్తాయి. ఈమాస్కులు ధరించి ఒకసారి తుమ్మినా, ద గ్గినా వెంటనే మరొకటి మార్చుకోల్సిందే. 

 

పొడి క్లాత్‌ బెటర్‌

మాస్కులు కంటే రుమాలు లేదా ఉతికిన పరిశుభ్రమైన పొడి క్లాత్‌ను వినియోగించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రయాణాలు సాగించే వారు ఎక్కువగా వీటిని వినియోగించాల్సి ఉంటుంది. నాణ్యమైన మా స్కులు ప్రస్తుతం మార్కెట్‌లో లేవని చెప్పవచ్చు. విశాఖ, తదితర ప ట్టణాల్లో కొన్నిచోట్ల నాణ్యమైన మాస్కులను విక్రయిస్తున్నాయి. వాటి వలన కాస్తో కూస్తో  వ్యాధి నిరోధం సాధ్యం. 

 

విదేశీ విద్యార్థులపై దృష్టి

పార్వతీపురానికి చెందిన నలుగురు విద్యార్థులు పలు దేశాల్లో  విద్యన భ్యసిస్తున్నారు. వీరిలో ఓవిద్యార్థిని పూర్తిగా తన ఇంటికి ఇంతవరకు రాలే దు. మరో విద్యార్థిని పట్టణానికి వచ్చి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వెళ్లిపోయారు. మరో ఇద్దరు స్థానికంగాఉంటున్నారు. వీరిని వైద్యశాఖ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దని స్పష్టంచేసింది. కరోనా వ్యాధి లక్షణాలు లేకున్నా, ఇతర దేశాల నుంచి రావడంతో ముందు జాగ్రత్త  గా అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో విద్య న భ్యసించి స్వదేశానికి వస్తున్న వారి జాబితాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందుతోంది. దీంతో  వైద్యశాఖ ముందస్తు చర్యలు తీసుకు ంటుంది. ప్రస్తుతానికి విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులకు వ్యాధి లక్షణాలు లేవని సమాచారం.

Updated Date - 2020-03-19T10:23:34+05:30 IST