-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Autovan collision Ten people injured
-
ఆటో-వ్యాన్ ఢీ... పది మందికి గాయాలు
ABN , First Publish Date - 2020-12-27T05:36:33+05:30 IST
సుంకి ప్రధాన రహదారిలో శనివారం ఆటో-వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. కృష్ణపల్లికి చెందిన పలువురు ఆటోలో రావివలసలోని బంధువులను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గరుగుబిల్లి, డిసెంబరు 26 : సుంకి ప్రధాన రహదారిలో శనివారం ఆటో-వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. కృష్ణపల్లికి చెందిన పలువురు ఆటోలో రావివలసలోని బంధువులను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ అయింది. ఆటోలో ఉన్న బి.సుభాషిని, ఆర్.భవానీ, కె.అన్నపూర్ణ, ఎన్.విజయ, పార్వతి, జి.గోవిందరావు, ఎ.రాజేశ్వరి, పి.పద్మతో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వై.సింహాచలం, ఏఎస్‌ఐ పి.రాంబాబు సహాయక చర్యలు చేపట్టి 108 వాహనంలో గాయపడిన వారిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.