ఆటో-నాటు బండి ఢీ... ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-12-28T04:50:01+05:30 IST

మరుపల్లి గ్రామంలో ఆదివారం నాటు బండి-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు.

ఆటో-నాటు బండి ఢీ... ఒకరు మృతి

గజపతినగరం : మరుపల్లి గ్రామంలో ఆదివారం నాటు బండి-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. మరు పల్లి గ్రామానికి చెందిన కోట దాలమ్మ(51), తూముల వెంకట లక్ష్మి, మామిడి పార్వతి, మహదేవ అప్పయ్యమ్మ గజపతిన గరం నుంచి ఆటోలో వస్తుండగా, మరుపల్లి రైస్‌ మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న నాటు బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోట దాలమ్మ తీవ్రంగా గాయపడ డంతో విశాఖ కేజీ హెచ్‌కు తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Read more