గ్రామాల్లో దాడులు : సారా స్వాధీనం

ABN , First Publish Date - 2020-03-08T10:54:39+05:30 IST

దుగ్గేరు గ్రామంలో నిల్వ చేసిన 430 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ కె.రాజేష్‌ శనివారం

గ్రామాల్లో దాడులు : సారా స్వాధీనం

మక్కువ, మార్చి 7: దుగ్గేరు గ్రామంలో నిల్వ చేసిన 430 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ కె.రాజేష్‌ శనివారం తెలిపారు. అందిన సమాచారం మేరకు గ్రామంలో సోదాలు చేయగా, ఒక వ్యక్తి ఇంటిలో సారా ప్యాకెట్లు లభ్య మయ్యాయన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో సారా తయారీ చేసినా, విక్రయించినా కఠిన చ్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో ఏఎస్‌ఐ డీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 


పార్వతీపురం టౌన్‌: కొమరాడ మండలం గుమడ గ్రామ పరిధిలో 450 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ శాఖ సీఐ అబ్దుల్‌ కలీమ్‌ తెలిపారు. శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు శనివారం దాడి చేయగా, సారాతో పాటు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గుమడ గ్రామానికి చెందిన వి.నర్సింగరావు, కె.సోమేశ్వరరావు, డి.అర్జున్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశామన్నారు. అలాగే పార్వతీపురం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాగృతి కార్యక్రమం నిర్వహించారు.  


సాలూరు: పట్టణంలో చిన్నవీధికి చెందిన జగం శేఖర్‌ 480 సారా ప్యాకెట్లతో శనివారం పట్టుబడినట్టు సీఐ సీహెచ్‌ బాలనర్సింహ తెలిపారు. శేఖర్‌ సారా ప్యాకెట్లను తన బైక్‌పై తరలిస్తుండగా, పట్టుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ ముందు హాజరుపరిచినట్టు తెలిపారు. 

Updated Date - 2020-03-08T10:54:39+05:30 IST