-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Attack on trunk bets
-
పొట్టేళ్ల పందాలపై దాడి
ABN , First Publish Date - 2020-12-27T05:35:13+05:30 IST
చినగుడబ శివారు ప్రాంతంలో శనివారం నిర్వహించిన పొట్టేళ్ల పందాలపై దాడి చేసినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు. ఈ దాడుల్లో రెండు పొట్టేళ్లు, రూ.37 వేలు నగదుతో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

గరుగుబిల్లి, డిసెంబరు 26 : చినగుడబ శివారు ప్రాంతంలో శనివారం నిర్వహించిన పొట్టేళ్ల పందాలపై దాడి చేసినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు. ఈ దాడుల్లో రెండు పొట్టేళ్లు, రూ.37 వేలు నగదుతో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గ్రామాల్లో పేకాటతో పాటు క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ జూదాలు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. పందెం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఏఎస్‌ఐ పి.రాంబాబు, సిబ్బంది గోవిందరావు, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.