ఉద్యోగాల పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-12T10:58:08+05:30 IST

బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నగదు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగులను మోస

ఉద్యోగాల పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు

నిందితుడు శ్రీకాకుళం జిల్లా వాసి


బొబ్బిలి, మార్చి 11: బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నగదు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగులను మోస గించిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చదలవాడ సత్య నారాయణ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన యజ్జల శ్రీధర్‌ అనే వ్యక్తి బొబ్బిలి మం డలం కుమందానపేటకు చెందిన అల్లు సత్యనారా యణకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికి రూ.3.50 లక్షలు వసూలు చేశాడు.


అతనికి యూనియన్‌ బ్యాంకులో డేటా ఆప రేటర్‌ ఉద్యోగం వచ్చినట్లుగా నకిలీ నియామక పత్రం అందించాడు.  ఆ ప త్రాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లిన సత్యనారా యణ అది నకిలీదని తెలిసి ఖంగుతిన్నాడు. దీనిపై గత ఏడాది మే ఒకటిన బొబ్బిలి పోలీసులను ఆ శ్రయించాడు. ఇలా శ్రీధర్‌ చేతిలో మోసానికి గురై న వారు మరికొంత మంది ఉన్నట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండ లం కోతుల గుమడ గ్రామానికి చెందిన కేతిరెడ్డి గణేశ్‌, మరడాన శంకరరావు, శంబంగి జోగి నా యుడు కూడా నిందితుని చేతిలో మోసపోయి నట్లు నిర్ధారణ కావడంతో అతడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ బాధితులు ఒక్కొక్కరు రూ.3లక్షల రూపాయల చొప్పున ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైం దని ఎస్‌ఐ చెప్పారు. 

Updated Date - 2020-03-12T10:58:08+05:30 IST