సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-12-30T05:34:37+05:30 IST

విజయనగరం మండలం గుంకలాం వద్ద బుధవారం తలపెట్టిన ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పేదల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఉదయం 11 తర్వాత ఆయన పర్యటన ప్రారంభం కానుంది.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

  గుంకలాంలో పట్టాలను పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి జగన్‌

విజయనగరం/ విజయనగరం క్రైం,డిసెంబరు 29: విజయనగరం మండలం గుంకలాం వద్ద బుధవారం  తలపెట్టిన ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పేదల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఉదయం 11 తర్వాత ఆయన పర్యటన ప్రారంభం కానుంది. మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌, ఎస్పీ రాజకుమారి, జేసీ కిషోర్‌కుమార్‌లు మంగళవారం లే అవుట్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ పరంగా వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఏర్పాట్లు చూస్తున్నారు. వేదిక నిర్మాణం పూర్తయింది. సమావేశానికి హాజరువుతున్న లబ్ధిదారులు, ప్రజల కోసం వాహనాలు సిద్ధం చేశారు. ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌, డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో బస్సులు కేటాయించారు. 

పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ రాజకుమారి చెప్పారు. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ఆమె మంగళవారం పర్యవేక్షించారు. హెలిపాడ్‌, బారికేడ్లను పరిశీలించారు. బందోబస్తుకు సంబంధించి ఇద్దరు ఏఎస్‌పీలు, తొమ్మిది మంది డీఎస్పీలు, 28 మంది సీఐ/ఆర్‌ఐలు, 84 మంది ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు, 249 ఎఎస్‌ఐలు/హెడ్‌కానిస్టేబుల్స్‌, 466 మంది పీసీలు, 184 మంది హోంగార్డులు, 128 మంది ఎస్‌టీఎఫ్‌ కానిస్టేబుల్స్‌ను, 117 మంది రిజర్వు కానిస్టేబుల్స్‌ని వినియోగిస్తామన్నారు. ఎస్పీ వెంట ఏఎస్‌పీ శ్రీదేవి, ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, డీఎస్పీలు ఉన్నారు. 


Updated Date - 2020-12-30T05:34:37+05:30 IST