సచివాలయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-08-20T10:22:01+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ చెప్పారు. ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మం

సచివాలయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు

కలెక్టరు హరి జవహర్‌లాల్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 19: కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ చెప్పారు. ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లు సంయుక్తంగా బుధవారం కలెక్టర్లు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ వరకూ జరిగే సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.సుమారు 22 వేల మంది పరీక్షలు రాసేందుకు అనుగుణంగా జిల్లాలో 114 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సెంటర్లు కేటాయిస్తామని తెలిపారు.


ఇన్విజిలేషన్‌కు 55 సంవత్సరాలు పైబడిన వారిని మినహాయిస్తామని, పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని అన్నారు. పరీక్షలు పారదర్శకంగా  నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జేసీ (అసరా, సంక్షేమం) జె.వెంకటరావు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో సునీల్‌ రాజకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more