తెలుగు రైతు అధ్యక్షుల నియమాకం

ABN , First Publish Date - 2020-12-08T05:15:21+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు రైతు విభాగం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించింది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం జాబితాను ప్రకటించారు.

తెలుగు రైతు అధ్యక్షుల నియమాకం

ముగ్గురు జిల్లా వాసులకు అవకాశం

పార్వతీపురం, డిసెంబరు 7 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు రైతు విభాగం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించింది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం జాబితాను ప్రకటించారు. విజయనగరం పార్లమెంట్‌కు చీపురుపల్లికి చెందిన పైల బలరామ్‌ ఎంపికయ్యారు. విశాఖపట్నం జిల్లా పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షునిగా కొత్తవలసకు చెందిన తిక్కాన చినదేముడును ఎంపిక చేశారు. ఈయన గత కొన్నేళ్లుగా తెలుగు రైతు సంఘ అధ్యక్షునిగా కొనసాగుతూ వస్తున్నారు. మళ్లీ ఆయనకే ఈ పదవి వరించింది. అరకు పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవకోటి వెంకటనాయుడు నియామకమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్న వెంకటనాయుడు గతంలో జిల్లాలో పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించి వివిధ పదవులను చేపట్టారు.  పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సీనియర్‌ నాయకులుగా ఉన్న వారిని ఈ పదవులు వరించాయి. 


Updated Date - 2020-12-08T05:15:21+05:30 IST