మినీ ట్రక్కులకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2020-11-22T04:56:58+05:30 IST

సబ్‌ప్లాన్‌ మండలాల్లోని నిరుద్యోగ యువతకు మినీ ట్రక్కుల మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ కోరారు.

మినీ ట్రక్కులకు దరఖాస్తు చేసుకోండి

ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

పార్వతీపురం, నవంబరు 21 :

సబ్‌ప్లాన్‌ మండలాల్లోని నిరుద్యోగ యువతకు మినీ ట్రక్కుల మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ కోరారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ట్రైకార్‌ ద్వారా 60 శాతం రాయితీపై 60 మినీ ట్రక్కులను గిరిజన యువతకు అందించనున్నట్టు చెప్పారు. ట్రక్కు విలువ రూ.5,81,190 కాగా, ప్రభుత్వ రాయితీ 60 శాతం, బ్యాంకు రుణం 30 శాతం, లబ్ధిదారుని వాటా 10 శాతం  ఉంటుందన్నారు. బ్యాంకు నుంచి పొందిన రుణాన్ని 72 నెలల్లో తిరిగి చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుని, సంక్షేమ సహాయకులకు ఈ నెల 27లోగా అందజేయా లన్నారు. లబ్ధిదారుని కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేలు  మించి ఉండకూదన్నారు. దరఖాస్తుదారుని వయసు 21 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని, కనీసం 7వ తరగతి ఉత్తీర్ణతతో పాటు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాల న్నారు. వాహనం పొందిన లబ్ధిదారులు జనవరి నుంచి ఇంటింటికీ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రాయితీ బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఈ మినీ ట్రక్కులను వినియోగించాల్సి ఉంటుందన్నారు.   రామభద్ర పురం: మండలంలో ఎస్టీ లబ్ధిదారులకు మినీ ట్రాక్టర్లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీవో ఉషారాణి  తెలిపారు.  ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Read more