ఏపీజీవీబీ ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2020-12-12T05:08:15+05:30 IST
తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీజీవీబీ ఉద్యోగులు శుక్రవారం ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 11: తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీజీవీబీ ఉద్యోగులు శుక్రవారం ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మధుసూధనరావు, మణికంఠ మాట్లాడుతూ.. జిల్లాల్లో 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, మారుమూల ప్రాంతాల్లో సైతం సేవలు అందిస్తున్నాయన్నారు. ఎస్‌బీఐ ప్రయోజిత 14 ఆర్‌ఆర్‌బీలు ఒకే గొడుగు కిందకు వచ్చి తమ డిమాండ్లను పరిశీలించాలని కోరారు. అన్ని రకాల రుణాలు, వాటిపై విధించే వడ్డీ రేట్లను యథాతథంగా అమలు చేయాలన్నారు. గ్రామీణ బ్యాంకులకు పదోన్నతుల విషయంలో స్పందించాలన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో గ్రామీణ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.