నిబంధనలకు తూట్లు.. యథేచ్ఛగా విక్రయాలు!

ABN , First Publish Date - 2020-09-21T10:40:26+05:30 IST

నిబంధనలకు తూట్లు.. యథేచ్ఛగా విక్రయాలు!

నిబంధనలకు తూట్లు.. యథేచ్ఛగా విక్రయాలు!

బొబ్బిలి: పట్టణంలో కొన్ని చికెన్‌, మటన్‌ దుకాణాలను ఇష్టారాజ్యంగా నిర్వ హిస్తున్నారు. మృత జీవాలతో జోరుగా వ్యాపారం సాగిస్తున్నా..  పట్టించుకునే వారే కరువయ్యారు. అసలు పట్టణంలో 32 మటన్‌, 46 చికెన్‌ షాపులు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ వాస్తవానికి వాటి సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువగా కనిపి స్తోంది. అయితే కొందరు వ్యాపారులు పశువైద్యుడు ధ్రువీకరణ, వాటిపై ముద్ర లేకుండానే  మాంసం విక్రయాలు చేపడుతున్నారు.  కోళ్లు, గొర్రెలు, మేకలను  అక్కడికక్కడే చంపి వాటి వ్యర్థాలను కూడా అక్కడే పారబోస్తున్నారు. ఇంకొందరు మృతకోళ్లను సైతం విక్రస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాట మాడుతున్నారు.  ఇటీవల మునిసిపల్‌ కమిషనర్‌ , ఇతర సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేసి మృతి చెందిన కోళ్లను అమ్ముతున్న షాపును సీజ్‌ చేశారు.  పట్టణంలో చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలపై థర్డ్‌పార్టీ విచారణ జరిపించామని  మునిసిపల్‌ కమిష నర్‌ ఎంఎం నాయుడు తెలిపారు.  ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సిబ్బందితో వాటి లెక్కలు తేల్చుతున్నామని, పూర్తి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.  కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు కబేళాలను ఎత్తివేశామన్నారు.  రెండెకరాల స్థలంలో ఆఽధునిక శ్లాటర్‌ హౌస్‌ను ఏర్పాటు చేయాలనే ఆదేశాలున్నాయన్నారు. అయితే స్థల సేకరణ కష్టంగా ఉందని చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నామని,  నిబంధనలు అతిక్రమిస్తే  చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Updated Date - 2020-09-21T10:40:26+05:30 IST