నిధులు మంజూరైనా.. సాగని పనులు!

ABN , First Publish Date - 2020-09-21T10:40:07+05:30 IST

నిధులు మంజూరైనా.. సాగని పనులు!

నిధులు మంజూరైనా.. సాగని పనులు!

మెరకముడిదాం: మండలంలో కీలకమైన తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయాల భవన నిర్మాణాలకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. పనులు ముందుకు సాగకపోవడంతో సర్వత్రా విమర్హలు వెల్లువెత్తుతున్నాయి.  వాస్తవంగా ఈ రెండు కార్యాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.  దీంతో నూతన భవనాలకు గాను దాదాపు రెండేళ్ల  కిందట గత ప్రభుత్వం  అనుమతులు జారీ చేసింది. ఈనేపథ్యంలో రెండు కార్యాల యాలు మకాం మార్చి పాత భవనాలు ఖాళీ చేశాయి. అయితే నేటికీ పనులు ప్రారంభంకాలేదు. మండల పరి షత్‌ కార్యాలయం భవన నిర్మాణానికి నిధులు మంజూ రవగా.. ఈ మేరకు టెండర్‌ ప్రక్రియ పూర్తిచేశారు. అయితే  ప్రత్నామ్నాయం లేకపోవడంతో మండల పరిషత్‌ కార్యాలయం ఖాళీ చేయలేదు. కొద్ది నెలల తరువాత ఖాళీ చేసినా సంబంధిత కాంట్రాక్టర్‌  టెండర్‌ను  రద్దు చేసుకున్నారు. అప్పటినుంచి భవన నిర్మా ణం ఊసేలేకుండా పోయింది. ప్రస్తుతం స్త్రీశక్తి భవనంలో మండల పరిషత్‌ కార్యాల యాన్ని నిర్వహిస్తున్నారు.  ఇదిలా ఉంటే  తహసీల్దార్‌ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి సీసీఎల్‌ నుంచి అనుమతులు వచ్చాయి. అయితే పాతభవనం కూల గొట్టి దాని స్థానంలో కొత్తభవనం నిర్మించాల్సి ఉంది.  దీంతో రెవెన్యూ సిబ్బంది పాత కార్యాలయాన్ని ఖాళీ చేశారు. మరో భవనంలో కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే నేటికీ  భవనం తొలగింపు పనులు కూడా ప్రారంభం కాలేదు. మొత్తంగా మండలంలోని రెండు ప్రధాన కార్యాలయాలకు  సొంతగూడు కరువైంది. దీంతో ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని  ఆయా ప్రాంతవాసులు కోరు తున్నారు. ఈ అంశంపై ఎంపీడీవో త్రినాథరావు మాట్లాడుతూ.. మండల పరిషత్‌ భనవ నిర్మాణాలకు సంబంధించి గతంలో ఇచ్చిన నిధులు చాలలేదని తెలిపారు.  దీంతో అంచనాలు పెంచి తిరిగి అధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని, ఆ తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో కొన్ని రెవెన్యూ కార్యాలయాల భవన నిర్మాణాలకు సంబంధించి సీసీఎల్‌ నుంచి అనుమతులు రావల్సి ఉందని తహసీల్దార్‌ బి.రత్నకుమార్‌ తెలిపారు. 

 

Updated Date - 2020-09-21T10:40:07+05:30 IST