మహిళలకు రక్షణ ఏదీ?

ABN , First Publish Date - 2020-12-16T04:20:35+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆందోళన వ్యక్తంచేశారు. 18 నెలల పాలనలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు పెరిగాయన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర ్గంలో జరిగిన ఘటనను తీవ్రంగా నిరసిస్తూ ఆమె మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

మహిళలకు రక్షణ ఏదీ?
మాట్లాడుతున్న వనజాక్షి

పులివెందుల సంఘటన దారుణం 

తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి 

విజయనగరం రూరల్‌, డిసెంబరు 15: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆందోళన వ్యక్తంచేశారు. 18 నెలల పాలనలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు పెరిగాయన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర ్గంలో జరిగిన ఘటనను తీవ్రంగా నిరసిస్తూ ఆమె మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఒకరిని చూసి మరొకరు బరి తెగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర ్గంలో మహిళపై అత్యాచారం... హత్య ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మహిళలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు. తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధ బేగం మాట్లాడుతూ, 18 నెలల ప్రభుత్వ పాలనలో మహిళలపై 436 దుర్ఘటనలు జరిగాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని, చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. సమావేశంలో తెలుగు మహి ళ ప్రతినిధులు వడ్లమాని సుభద్ర, చెన్నా రూపావాణి, గొండేల దుర్గాప్రసన్న, ఉమామహేశ్వరి, పద్మలత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T04:20:35+05:30 IST