కరోనా నియంత్రణపై శ్రద్ధ ఏదీ?

ABN , First Publish Date - 2020-04-15T10:54:10+05:30 IST

ప్రపంచమంతా కరోనా నియంత్రణలో ఉంటే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎన్నికల కమిషర్‌ను తొలగించే ప్రక్రి యలో ఉన్నారని, దీంతోనే ఆయన ఎంత శ్రద్ధ కనబరుస్తున్నారో...

కరోనా నియంత్రణపై శ్రద్ధ ఏదీ?

టీడీపీ జిల్లా అధ్యక్షుడు చిన్నంనాయుడుపూసపాటిరేగ, ఏప్రిల్‌ 14: ప్రపంచమంతా కరోనా నియంత్రణలో ఉంటే  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎన్నికల కమిషర్‌ను తొలగించే ప్రక్రి యలో ఉన్నారని, దీంతోనే ఆయన ఎంత శ్రద్ధ కనబరుస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు మహంతి చిన్నంనాయుడు అన్నారు. చల్లవానితోటలోని మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడి స్వ గృహంలో ఆయన మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా అంబేడ్క ర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.  అనంతరం వివిధ డిమాండ్లతో కలిగిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరాహార దీక్ష నిర్వహించారు.   లాక్‌డౌన్‌ సమయంలో ప్రతి తెల్ల రేషన్‌ కార్డుదారునికి రూ.5వేలు అందజేయా లని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పతివాడ తమ్మినాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఆకిరి ప్రసాదరావు, మండల నాయకులు మహంతి శంకరరావు, ఇజ్జురోతు ఈశ్వరరావు, దంగా భూలోక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-15T10:54:10+05:30 IST