-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Anger over quality defect in Today Today
-
‘నాడు - నేడు’లో నాణ్యత లోపంపై ఆగ్రహం
ABN , First Publish Date - 2020-12-16T05:27:15+05:30 IST
నాడు - నేడు నిర్వహణపైౖ అలసత్వంతో పాటు పనుల్లో నాణ్యత లోపించడంపై పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏఈ, పాఠశాల ప్రిన్సిపాల్‌కు సోకాజ్ నోటీసులు : పీవో ఆదేశం
కొమరాడ, డిసెంబరు 15: నాడు - నేడు నిర్వహణపైౖ అలసత్వంతో పాటు పనుల్లో నాణ్యత లోపించడంపై పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బాలయోగి గురుకుల పాఠశాల/కళాశాలను పీవో పరిశీలించారు. పాఠశాల డార్మిటరీ మరమ్మతులకు వెచ్చి ంచిన నగదుతో జరిగిన పనుల్లో నాణ్యతా లోపాన్ని గుర్తించారు. నాణ్యత లేని వస్తు వుల వినియోగం, ఖర్చు చేసిన నిధుల కంటే పనులు తక్కువ చేయడంతో ఏఈ ఇబ్రహింపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలో మౌలిక సదు పాయాల కల్పనకు రూ. 62 లక్షలు మంజూరయ్యాయని, ఇందులో రూ. 19 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి పీవోకు తెలిపారు. నాడు నేడు పనుల్లో ముందుగా మరుగుదొడ్ల మరమ్మతులు, నీటి సరఫరాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వా ల్సి ఉన్నా ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో చేసిన పనులపై సమగ్ర నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఐటీడీఏ ఈఈ శాంతేశ్వరరావును పీవో ఆదేశించారు. అనంతరం పీవో విలేఖరులతో మాట్లాడుతూ నాడు నేడు నిధులతో చేపట్టిన పనులపై సమగ్ర నివేదిక వచ్చిన తరువాత ఖర్చు చేసిన నిధుల్లో ఎంత దుర్వినియోగం జరిగిందో తేలనుందన్నారు. తక్షణమే ఏఈ ఇబ్రహిం, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మిలకు సోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఈఈని ఆదేశించారు. ని వేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పరిశీల నలో డీఈ తిరుపతిరావు ఉన్నారు.
గర్భిణులకు వైద్య పరీక్షలు చేయండి
పార్వతీపురం: గిరిశిఖర ప్రాం తాల్లోని గర్భిణులకు ఎప్పటి కప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిం చాలని ఐటీ డీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో జిల్లా మలేరి యా అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మా ట్లాడుతూ గిరి జనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు గిరి శిఖర ప్రాం తాల గిరిజ నులకు మెరుగైన వైద్యం అంది ంచాలని సూచించారు. డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్ రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.