సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ

ABN , First Publish Date - 2020-04-21T06:24:22+05:30 IST

పి.కోనవలస సమీపంలోగల ఆంధ్రా, ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టును ఏఎస్పీ బింధు మాదవ్‌ సోమవారం తనిఖీ చేశారు. నిత్యావసర వాహ నాలు తప్ప మిగతా వాహనాల రాకపోకలకు అనుమతి...

సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ

పాచిపెంట, ఏప్రిల్‌ 20: పి.కోనవలస సమీపంలోగల ఆంధ్రా, ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టును ఏఎస్పీ బింధు మాదవ్‌ సోమవారం తనిఖీ చేశారు. నిత్యావసర వాహ నాలు తప్ప మిగతా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వ వద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏఎస్పీ వెంట సాలూరు సీఐ ఎస్‌.సింహాద్రినాయుడు, ఎస్‌ఐ సీహెచ్‌.గంగరాజులు ఉన్నారు. 


పది గంటల తర్వాత బయటకు రావద్దు 

కొటారుబిల్లి కూడలి(గంట్యాడ): లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయం లో నిత్యావసరాల కొనుగోలుకు వచ్చే ప్రజలు తిరిగి పది గంటల లోపే ఇళ్లకు వెళ్లే విధంగా చూడాలని ఓఎస్‌డీ రామ్మోహన్‌ అన్నారు. కొటారుబిల్లి కూడలిలో ఉన్న చెక్‌పోస్టును ఆయన సోమవారం తనిఖీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గణేష్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-04-21T06:24:22+05:30 IST