సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

ABN , First Publish Date - 2020-12-20T05:03:27+05:30 IST

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టరు మహేష్‌కుమార్‌ సూచించారు. వైద్యఆరోగ్యశాఖాధికారులతో శనివారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నిర్మూలనకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ మహేష్‌కుమార్‌

జేసీ మహేష్‌కుమార్‌ 

విజయనగరం (ఆంధ్రజ్యోతి)  డిసెంబరు 19: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టరు మహేష్‌కుమార్‌ సూచించారు. వైద్యఆరోగ్యశాఖాధికారులతో శనివారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  దోమల నిర్మూలనకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దోమలు విజృంభిస్తే ప్రమాదకరమని, ఆదిలోనే అదుపు చేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. సమావేశంలో వైద్యాధికారులు రమణ కుమారి, నాగభూషణరావు, రామమోహన, రవికుమార్‌, చామంతి, రవికుమార్‌రెడ్డి, తులసీతో పాటు వైద్యాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T05:03:27+05:30 IST