ఆన్‌లైన్‌ రుణాలపై అప్రమత్తం

ABN , First Publish Date - 2020-12-25T05:44:21+05:30 IST

ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌ల రుణాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు.

ఆన్‌లైన్‌ రుణాలపై అప్రమత్తం

విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

 విజయనగరం క్రైం, డిసెంబరు 24: ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌ల రుణాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు.  ఫోన్‌లో రుణాలు మంజూరు చేస్తామని చెప్పే వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కొద్దని చెప్పారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు.  పిల్లలు సత్ప్రవర్తనతో మెలగడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలక మని  గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు  నిండని వారు ప్రేమ వ్యవహారం నడిపితే చట్టరీత్యా నేరమన్నారు.  అవగాహన లేక  ఇటువంటి వ్యవహారాల్లో ఇరుక్కుని ఎంతోమంది దోషులుగా మారుతున్నారన్నారు. ఈ తరహా నేరాలకు పోక్సో చట్టం కింద శిక్షణ ఉన్నాయన్నారు. భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనిస్తుండాలని తెలిపారు. సన్మార్గంలో నడిచేలా చూడాలన్నారు. స్నేహంగా మెలిగి, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని చెప్పారు.  

 

Updated Date - 2020-12-25T05:44:21+05:30 IST