అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

ABN , First Publish Date - 2020-12-02T04:36:58+05:30 IST

ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పిలుపునిచ్చారు. వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా వర్చువల్‌ విధానంలో మంగళవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, డిసెంబరు 1: ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పిలుపునిచ్చారు. వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా వర్చువల్‌ విధానంలో మంగళవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తొలుత క్విజ్‌ పోటీల విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష ప్రదర్శించకూడదని, వారిని మనలో ఒకరిగా చూడాలని చెప్పారు. చికిత్స కంటే నివారణే ఎయిడ్స్‌కు ఏకైక మార్గమని.. ఈ వ్యాధిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. హెచ్‌ఐవీ బాధితుల ఆరోగ్యం కాపాడటం, కొత్తవారు వ్యాధి బారిన పడకుండా చూడటం మన లక్ష్యమన్నారు. బాధితుల జీవిత కాలాన్ని పెంచేందుక అవగాహన పెంపొందించాలని చెప్పారు. వారు పౌష్టికాహారం, అవసరమైన మందులను తీసుకునేలా చూడాలని తెలిపారు. ఎయిడ్స్‌పై అవగాహన పరచడంలో స్వచ్ఛంద సంస్థలు కూడా మెరుగైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో జేసీ ఆర్‌.మహేష్‌కుమార్‌, జిల్లా అదనపు వైద్యారోగ్య శాఖాధికారి, ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారి జె.రవికుమార్‌, అదనపు వైద్యాధికారి ఎల్‌.రామ్మోహహనరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T04:36:58+05:30 IST