-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Aditi Gajapatiraju
-
అధిక స్థానాలు మావే!
ABN , First Publish Date - 2020-03-13T11:17:33+05:30 IST
నగరపాలక సంస్థ తొలి మేయర్ పదవిని టీడీపీ దక్కించుకుంటుందని విజయనగరం నియోజకవర్గ

అదితి గజపతిరాజు
విజయనగరం టౌన్, మార్చి12: నగరపాలక సంస్థ తొలి మేయర్ పదవిని టీడీపీ దక్కించుకుంటుందని విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి పూసపాటి అదితి గజపతిరాజు తెలిపారు. 50 డివిజన్లకు గానూ కనీసం 36 స్థానాల్లో గెలుస్తామన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు యువత, మహిళలతోపాటు పార్టీకి సేవలు అందించిన వారందరికీ టిక్కెట్లు ఇచ్చామన్నారు. ప్రధానంగా ఈ సారి కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
నగరపాలక సంస్థ టీడీపీ మేయర్ అభ్యర్థి కంది శమంతకమణి మాట్లాడుతూ.. తనను నమ్మి టికెట్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి అశోక్, టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పదవిని వారికి బహుమతిగా ఇస్తానన్నారు. మాజీ కౌన్సిలర్ కంది మురళీనాయుడు మాట్లాడుతూ విజయనగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకే దక్కుతుందని తెలిపారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో టీడీపీ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందన్నారు.