అధిక ధరలకు అమ్మితే చర్యలు

ABN , First Publish Date - 2020-04-24T10:43:17+05:30 IST

ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మితే చర్య లు తప్పవని తూనికల కొలతల అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎస్‌ఎం రాధాకృష్ణ

అధిక ధరలకు అమ్మితే చర్యలు

బాబామోట్ట, ఏప్రిల్‌ 23: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మితే చర్య లు తప్పవని తూనికల కొలతల అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎస్‌ఎం రాధాకృష్ణ అన్నారు. తూనికల కొలతలు డిప్యూటీ కంట్రోలర్‌ ఎన్‌.జనార్ధదనరావు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (శ్రీకాకుళం) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయ నగరంలో దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కేఎల్‌పురం కలెక్టర్‌ ఆఫీస్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో రేషన్‌, కిరాణా షాపుల్లో దాడులు నిర్వహించి అధిక ధరలకు అమ్మిన వారిపై 5 కేసులు నమోదు చేశా మని చెప్పారు.  వ్యాపారవస్తులపై ఎటువంటి అనుమానం ఉన్నా 9490165282, 08922223844 నెంబర్లకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ, సీహెచ్‌ సత్యనారాయణ, ఏఈలు జి.ప్రేమ్‌కుమార్‌, ఎం.రవికిశోర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-04-24T10:43:17+05:30 IST