టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక

ABN , First Publish Date - 2020-12-21T04:08:53+05:30 IST

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపడతామని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. ఆదివారం వెంకంపేటలో పార్వతీపురం నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులతో కాలం గడుపుతోందని.. అభివృద్ధిపై దృష్టిసారించడం లేదని ఆరోపించారు. జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనులకు, సీతానగరం వంతెన నిర్మాణాని టీడీపీ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని..కానీ నేటికీ పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు.

టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జగదీష్‌


ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌

పార్వతీపురం / రూరల్‌, డిసెంబరు 20: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపడతామని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. ఆదివారం వెంకంపేటలో పార్వతీపురం నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులతో కాలం గడుపుతోందని.. అభివృద్ధిపై దృష్టిసారించడం లేదని ఆరోపించారు. జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనులకు, సీతానగరం వంతెన నిర్మాణాని టీడీపీ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని..కానీ నేటికీ పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలోని రహదారులు అధ్వానంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంలో కార్యకర్తలు కీలకంగా వ్యవహరించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బొబ్బిలి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బేబీనాయన, పార్వతీపురం మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి, పట్టణానికి చెందిన డాక్టర్‌ మంచిపల్లి శ్రీరాములు, యాళ్ల వివేక్‌, దేవకోటి వెంకటనాయుడు,. సీతానగరం మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షుడు కొల్లి తిరుపతినాయుడు, కొమ్మినేని కిశోర్‌కుమార్‌, రౌతు వేణుగోపాలనాయుడు తదితరులు హాజరయ్యారు.


Updated Date - 2020-12-21T04:08:53+05:30 IST