పత్తి కొనుగోలుకు చర్యలు : జేసీ

ABN , First Publish Date - 2020-11-08T04:46:02+05:30 IST

పత్తి కొనుగోలుకు పక్రియ ప్రారంభించినట్లు జేసీ కిషోర్‌కుమార్‌ తెలిపారు.

పత్తి కొనుగోలుకు చర్యలు : జేసీ

విజయనగరం (ఆంధ్రజ్యోతి) నవంబరు 7 :

  పత్తి కొనుగోలుకు పక్రియ ప్రారంభించినట్లు జేసీ కిషోర్‌కుమార్‌ తెలిపారు. శని వారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పత్తి కొనుగోలుకు సంబంధించి రైతుభరోసా కేంద్రాల వద్ద సజావుగా రిజిస్ర్టేషన్‌ చేపట్టాలన్నారు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రంలో ఎప్పుడు విక్రయించాలో రైతులకు మెసేజ్‌లు పంపించాలని చెప్పారు.   రామభద్రపురం మండలం బూసాయవలస జిన్నింగ్‌ మిల్లులో  కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్‌ ఏడీ వైవీ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. రైతులు రిజిస్ర్టేషన్‌ చేసేటప్పుడు విధిగా ఆధార్‌, పట్టాదారు పాస్‌బుక్‌ జెరాక్స్‌ కాపీలు ఇవ్వాలని సూచించారు.  పత్తిలో తేమ 8-12 శాతం ఉంటేనే కొనగోలు చేస్తామని భారతీయ పత్తి సంస్థ సభ్యుడు ప్రవీణ్‌ స్పష్టం చేశారు. మొదటిరకం క్వింటాకు రూ.5,825, రెండో రకం  క్వింటాకు రూ.5,515 ధర నిర్ణయించినట్లు తెలిపారు. జిన్నింగ్‌ మిల్లులో భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావుని జేసీ ఆదేశించారు.  సమావేశంలో ఆర్డీవో భవానీ శంకర్‌ , జిన్నింగ్‌ మిల్లు మేనేజర్‌ ఎస్‌.ఖన్నన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-08T04:46:02+05:30 IST