బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-03-15T11:22:29+05:30 IST

బెల్టుషాపులు నిర్వహిసే చర్యలు తప్పవని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌-2 సీఐ లీలా రాణి

బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు

విజయనగరం దాసన్నపేట, మార్చి 14 : బెల్టుషాపులు నిర్వహిసే చర్యలు తప్పవని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌-2 సీఐ లీలా రాణి అన్నారు. మద్యం వల్ల కలిగే అనర్థాలపై కోరాడపేట గ్రామంలో జాగృతి పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా సీఐ లీలారాణి మాట్లాడుతూ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం సరఫరా చేస్తే, సమాచారం అందించాలన్నారు. ఇప్పటికే సర్కిల్‌-2 పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు. గ్రామ వలంటీర్లు, యువత గ్రామాల్లో మద్యం, సారా అమ్మకాలు నిర్వహిస్తే తక్షణమే సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సర్కిల్‌-2 సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-15T11:22:29+05:30 IST