ఇందిరమ్మకాలనీలో కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-27T05:34:40+05:30 IST

పట్టణ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో జరిగిన కబ్జా లపర్వంపై అధికారులు మౌనం వీడి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇందిరమ్మకాలనీలో కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

బొబ్బిలి, డిసెంబరు 26: పట్టణ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో జరిగిన కబ్జా లపర్వంపై అధికారులు మౌనం వీడి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. రైతుసంక్షేమసంఘం కార్యాలయంలో శనివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయనతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ కాలనీలో జరిగిన కబ్జాలపై అధికారులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిం చారు.  అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, అప్పటి తహ సీల్దారు స్పందించి విచారణ జరిపించారని, కానీ అక్రమాలపై ఎటువంటి చర్యలు లేవన్నారు. కొంతమంది అక్రమంగా పేదలకు చెందిన స్థలాలను కబ్జా చేసి వాటిలో ఇళ్లు నిర్మిం చి 25 నుంచి 30 లక్షల రూపా యలకు బహిరంగంగా అమ్ముతున్నప్పటికీ అధికారు లు చోద్యం చూస్తుండడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణం స్పందించి భూకబ్జాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తామే ప్రత్యక్ష ఆందోళనకు దిగి వాటిని పేదలకు కట్టబెడతామని హెచ్చరించారు. సీఐటీయూ, లోక్‌సత్తా, పీకేఎస్‌ నాయకులు పి.శంకరరావు, ఆకుల దామోదరరావు, టి.అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T05:34:40+05:30 IST