సంక్షేమ పథకాల లక్ష్యాలు సాధించండి
ABN , First Publish Date - 2020-12-12T05:03:53+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు, వైఎస్సార్ బీమా వంటి సంక్షేమ పథకాల లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ హరి జవహర్‌లాల్ ఆదేశం
విజయనగరం (ఆంధ్రజ్యోతి) , డిసెంబరు 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు, వైఎస్సార్ బీమా వంటి సంక్షేమ పథకాల లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశించారు. శుక్రవారం బ్యాంకు అధికారులు, లీడ్ బ్యాంకు మేనేజర్, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించడం లేదని అధికారులు తెలపగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి బ్యాంకుల వారీగా లక్ష్యాలు కేటాయించినప్పటికీ, వారిలో స్పందన లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వారంలో బ్యాంకుల ప్రగతిని జతచేసి ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌కు లేఖ రాయాలని జేసీ వెంకటరావుకి సూచించారు. బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచితేనే, వారు స్పందిస్తారని తెలిపారు. లేఖ ప్రతిని లీడ్ జిల్లా మేనేజర్ , జిల్లా స్థాయి బ్యాంకు అధికారులకు పంపాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్, నగర కమిషనర్ వర్మ తదితరులు ఉన్నారు.