పనులను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-11-25T05:30:00+05:30 IST

ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు సచివాలయాల ద్వారా అందించి ప్రజల్లో నమ్మకం కల్పించాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ సచి వాలయ సిబ్బందికి సూచించారు.

పనులను వేగవంతం చేయండి
కొమరాడ: విక్రమపురంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం పనులను పరిశీలిస్తున్న పీవో కూర్మనాథ్‌

కొమరాడ, నవంబరు 25: ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు సచివాలయాల ద్వారా అందించి ప్రజల్లో నమ్మకం కల్పించాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ సచి వాలయ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలో పీవో పర్యటిం చారు. విక్రంపురం సచివాలయాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రం, ఎంపీపీ పాఠశాలల్లో జరుగుతున ్న నాడు - నేడు పనులను పరిశీలించారు. కొమరాడ తహసీల్దార్‌ కార్యాలయంలో గిరిభూమికి సంబంధించి పనులపై ఆరా తీశా రు. అనంతరం సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయం గోడలపై ప్రభుత్వ పథకాలు, సమాచారాన్ని ప్రదర్శించారా లేదా అని పరిశీలించారు. సిబ్బంది ప్రతి రోజూ విధులకు హా జరవుతున్నది లేనిది, ఉద్యోగుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఎంపీపీ పాఠశాలలో నాడు నేడు పనులు పరిశీలించి సంబంధిత అధికారులకు నా ణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ-క్రాపింగ్‌, రిజిస్టర్‌ గూర్చి ఆరా తీశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సచివాలయాలకు మంచి పేరు తీసుకు రావడం సిబ్బంది చేతుల్లోనే ఉందని, ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమ స్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తహసీల్దార్‌ కేఎల్‌వీ ప్ర సాద్‌, వెలుగు ఏపీఎం వెంకటకిశోర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గ్రామాల్లో అధికారుల పర్యటన 

కొత్తవలస రూరల్‌(ఎల్‌.కోట): ఎల్‌.కోట మండలంలోని వివిద గ్రామాల్లో ఎల్‌.కోట మండల ప్రత్యేకాధికారిణి బి.విజయలక్ష్మి, ఎమ్పీడీవో ఎస్తేర్‌రాణి బుధవారం పర్యటించారు. మార్లాపల్లిలోని హౌసింగ్‌ కాలనీని సందర్శించారు. చందులూరు గ్రామ సచివాయాలన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొక్కలు నాటారు. కార్యక్రమంలో  హెచ్‌డీటీ ఇందిర, ఏపీవో చినప్పయ్య, ఏపీఎం శ్రీనివాసరావు, వివిద శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

భోగాపురం: మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా సహకరించాలని ఉపాధి హమీ పథకం ఏపీడీ ఎస్‌.రవీంద్ర అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ఎంపీడీవో డీ.బంగారయ్య, ఏపీవో ఆదిబాబుతో చర్చించారు.  జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కన్వర్‌జేషన్‌తో జరుగుతున్న అన్ని పనులను త్వరగా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తుండాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి త్రినాఽథ్‌, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-25T05:30:00+05:30 IST