ఏసీబీ తనిఖీలు
ABN , First Publish Date - 2020-09-03T10:56:32+05:30 IST
ఏసీబీ తనిఖీలుబలిజిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించ

ఫిర్యాదులపై విచారించిన బృందం
ఏసీబీ తనిఖీలుబలిజిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ బృందం విస్త ృత తనిఖీలు నిర్వహించి సిబ్బందిని విచారించారు. అనేక అంశాలపై ప్రశ్నలడిగారు. విచారణలో చెప్పిన విషయాలన్నీ నమోదు చేశారు.
అనంతరం ఏసీబీ డీఎస్పీ రఘువీర్‌విష్ణు విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే బలిజిపేట కార్యాలయంలో తనిఖీ చేసినట్టు వివరించారు. తహసీల్దార్ కార్యాలయంలో పాసుపుస్తకాల పంపిణీ, రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ నమోదుపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నట్టు తెలిపారు. తమకు బలిజిపేట తహసీల్దార్ కార్యాలయంపై ఏడు ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. సోదాల్లో సీఐలు మహేశ్వరరావు, సతీష్‌కుమార్, శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఇస్మాల్ పాల్గొన్నారు.