-
-
Home » Andhra Pradesh » Vizianagaram » A remarkable response to the blood donation camp
-
రక్తదాన శిబిరానికి విశేష స్పందన
ABN , First Publish Date - 2020-05-18T10:53:23+05:30 IST
స్ధానిక కళింగవైశ్యభవన్‌లో ఆదివారం రోటరీక్లబ్, కళింగ వైశ్యసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో

బొబ్బిలి, మే 17: స్ధానిక కళింగవైశ్యభవన్‌లో ఆదివారం రోటరీక్లబ్, కళింగ వైశ్యసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి, ఎస్‌ఐ ప్రసాదరావు, హెడ్‌కానిస్టేబుల్ శ్యామ్, 45 మంది రక్తదానం చేశారు. ఎమ్మెల్యే శంబంగి, టీడీపీ నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన, రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శిలు చంద్రకిశోర్, జేసీ రాజు, శ్రీనివాసరావు, విజయనగరం మహారాజా బ్లడ్‌బ్యాంకు అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, కార్తీక్, శ్రీహరి, సాయిరమేష్, చెలికాని మురళి పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంకు ప్రారంభం
రోటరీ క్లబ్ విజయనగరం (3020) ఆధ్వ ర్యంలో కొత్త ఆగ్రహారం వద్ద పార్వతీదేవీ అంచానియా వలంటీర్ బ్లడ్ బ్యాంకును కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. డాక్టర్లు రక్తదానం చేశారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ రవి.కె మండా, కార్యదర్శి జి.వినోద్‌కుమార్ డాక్టర్ తిరుమల ప్రసాద్ పాల్గొన్నారు.