పాఠశాల అదనపు భవనాలకు భూమి పూజ

ABN , First Publish Date - 2020-09-13T10:53:13+05:30 IST

స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.కోటి 45 లక్షల 80 వేలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర శనివారం భూమి పూజ నిర్వహించారు

పాఠశాల అదనపు భవనాలకు భూమి పూజ

మక్కువ, సెప్టెంబరు 12:  స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.కోటి 45 లక్షల 80 వేలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర శనివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండ లంలో పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూ.4 కోట్లు నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.


ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు మావుడి శ్రీనివాసరావు, మండల వైసీపీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు, ఎంపీడీవో సీహెచ్‌ సూర్యనారాయణ, తహసీల్దార్‌ డి.వీరభద్రరావు, వెలుగు ఏపీఎం సన్నిబాబు, వైసీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-13T10:53:13+05:30 IST