విజయనగరం : ఒకే గ్రామంలో 27 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-09T21:48:29+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్ట్‌లు చేస్తుండటంతో కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి...

విజయనగరం : ఒకే గ్రామంలో 27 కరోనా కేసులు

విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్ట్‌లు చేస్తుండటంతో కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం ముత్తాయివలసలో కరోనా కలకలం రేపింది. గురువారం నాడు ముత్తాయివలస గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకేసారి 27 మందికి పాజిటివ్ అని తేలింది. ఇన్నేసి కేసులు ఒక్కసారిగా నమోదవద్వడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఇన్ని కేసులు ఒక్కసారిగా ఎలా నమోదయ్యాయి..? గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా..? లేకుంటే ఏదైనా కార్యక్రమంలో పాజిటివ్ వ్యక్తి పాల్గొనగా ఇలా జరిగిందా..? అని అధికారులు ఆరా తీస్తున్నారు.


కాగా.. వారం క్రితం గ్రామంలో ఓ శుభకార్యం జరిగిందని.. ఆ కార్యక్రమంలో బయటి నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా కరోనా వ్యాపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకూ 27 మందికి వైరస్ సోకగా మరింత మందికి కరోనా సోకే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. పాజిటివ్ వచ్చినవారిని కోవిడ్ ఆసుపత్రికి తరలించిన అధికారులు.. వీరితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - 2020-07-09T21:48:29+05:30 IST