-
-
Home » Andhra Pradesh » Vizianagaram » 144 Criminal Cases in violation of Section
-
144 సెక్షన్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు
ABN , First Publish Date - 2020-03-25T11:26:18+05:30 IST
కరోనా వైరస్ నివారణకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో పాటు జిల్లాలో 144 సెక్షన్ అమలు

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించండి
విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలి
పంచాంగ శ్రవణం పేరిట గుమిగూడవద్దు
ఎస్పీ రాజకుమారి
విజయనగరం క్రైమ్, మార్చి 24: కరోనా వైరస్ నివారణకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో పాటు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేసిందని ఎస్పీ రాజ కుమారి అన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘి స్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మంగళవారం ఆమె మాట్లా డుతూ వైద్యం, నిత్యవసర వస్తువుల కొనుగోలుకు మినహా ఇతర సమయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండా లని సూచించారు. ఉద్యో గాలు, చదువులు, వ్యాపారాల పేరుతో విదేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని విజయనగరం స్పెషల్‌బ్రాంచ్ (9121109480)కు అంద జేయాలన్నారు.
సమాచారాన్ని ఇవ్వకపోతే వారిపై కేసు లు నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశిం చారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే సమ యంలో సామాజిక దూరాన్ని పాటించాల న్నారు. మోటారు సైకిళ్లపై ఒకరికంటే ఎక్కువమందిని అనుమ తించ వద్దని తెలిపారు. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తుల ఇళ్లకు నోటీ సులు అంటిం చాలని, ఆ ఇళ్లకు సమీపంలో నివసిస్తున్న వారి ఇళ్ల వద్ద పాయింట్ పుస్తకాలు పెట్టి, సదరు వ్యక్తులపై నిఘా పెట్టాలన్నారు. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా సరిహ ద్దులను మూసివేయాలని ఆదేశించారు. అత్యవసర వస్తువులను రవాణా చేసే వాహనాలను, వైద్యసేవలకు వెళ్లే వాహనాలను మాత్రమే విడిచిపెట్టాలన్నారు. పం చాంగ శ్రవణం పేరిట ప్రజలు ఒక ప్రదేశంలో గుమి గూడవద్దని కోరారు.
పోలీస్ సబ్‌డివిజన్‌లో నిఘా పటిష్ఠం: ఏఎస్పీ
పార్వతీపురం సబ్ డివిజన్ పరిధిలోకి ఇతర దేశాల నుంచి వస్తున్న వారి పట్ల గట్టి నిఘాను ఉంచినట్లు ఏఎస్పీ సుమిత్ గార్గ్ తెలిపారు. మంగళ వారం తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వీలుగా ఇతర దేశాల నుంచి వస్తున్న వారిని ప్రత్యేక పరిశీలన చేస్తున్నామని, వారి కదలికలపై దృష్టి పెట్టామన్నారు.
ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో పాటు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున వృథాగా తిరుగుతున్న వారిని గుర్తించామని, వారి వద్దనుంచి 50 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని ఈనెల 31న లాక్‌డౌన్ ఎత్తి వేత తరువాత యజమానులకు అప్పగిస్తామన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై స్వీయ నిర్భంధంలో ఉండాల న్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ దాశరథి, ఎస్‌ఐలు కళాధర్(టౌన్), రూరల్ ఎస్‌ఐ వీరబాబు ఉన్నారు.