14 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి

ABN , First Publish Date - 2020-03-30T11:00:41+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారంతా 14 రోజులు గృహ

14 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి

వ్యాధి లక్షణాలను దాచిపెట్టొద్దు

లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వారికి భోజన వసతి

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌


విజయనగరం(ఆంధ్రజ్యోతి), మార్చి 29: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారంతా 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాల్సిందేనని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మండల స్థాయి, మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వ్యాధి లక్షణా లను ఉన్నవారు దాచిపెట్టకుండా వివరించేలా అవగాహన కల్పించాలన్నారు. లాక్‌డౌ న్‌లో చిక్కుకున్న వారికి ఆయా ప్రాంతాల్లోని బీసీ, గిరిజన, ఎస్సీ, సంక్షేమ హాస్టల్స్‌లో వసతి కల్పించాలన్నారు. వచ్చే 15రోజుల పాటు వారికి భోజన సదుపాయం కల్పిం చాలని ఆదేశించారు. ప్రస్తుతం హాస్టల్స్‌ ఉన్న సరుకులను వినియోగించాలని, అవస రమైతే విపత్తుల నిధి నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.


ఉచిత రేషన్‌ కోసం ఒకేసారి ఎక్కువ మంది రేషన్‌ దుకాణాలకు వచ్చే అవకాశం ఉందని, వారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చేనెల 15 వరకు రేషన్‌ పంపిణీ చేస్తామన్న విషయాన్ని కార్డుదారులకు తెలియజేయాలన్నారు. పట్టణాల్లో మాంసం దుకాణాల వద్ద గుంపులుగా చేరుతున్నారని, అటువంటి వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కరోనాపై ప్రజలపై మరింత అవగాహన కల్పించేలా ఉద్యో గులు, ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొంటున్న వారికి గ్లౌజ్‌లు, మాస్క్‌లు అందజేయాలని సూచించారు. ఇందుకోసం డీఆర్‌డీఏ, మె ప్మా పీడీ, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌తో ఓ కమిటీని వేస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2020-03-30T11:00:41+05:30 IST