108 సిబ్బంది సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2020-07-08T11:43:50+05:30 IST

సమాజంలో గురుతరమైన బాధ్యతతో సేవలు అందిస్తున్న 108 సిబ్బంది సేవలు ప్రశంసనీయమని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌

108 సిబ్బంది సేవలు ప్రశంసనీయం

దాసన్నపేట, జూలై 7: సమాజంలో గురుతరమైన బాధ్యతతో సేవలు అందిస్తున్న 108 సిబ్బంది సేవలు ప్రశంసనీయమని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఎమ్‌.వెంకటేశ్వరరావు అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతులను పురస్కరించుకుని మంగళవారం వెంకటపద్మా ఆసుపత్రి, జయంతి స్మారక గ్రంథాలయ సేవా సంస్థలు సంయుక్తంగా పలువురు 108 ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో 108 సిబ్బంది ఎంతో ధైర్య, సాహసాలతో సేవలందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ  సంస్థ మాజీ చైర్మన్‌ రొంగలి పోతన్న, సంస్థ ప్రతినిధులు భాషా, ధవళ సర్వేశ్వరరావు, 108 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కృష్ణంరాజు, గోపాల కృష్ణ, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T11:43:50+05:30 IST