-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ZOO INCOME 5 LAKHS
-
జూకు రూ.4 లక్షల ఆదాయం
ABN , First Publish Date - 2020-12-28T05:19:41+05:30 IST
ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది.

ఆరిలోవ, డిసెంబరు 27: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. విశాఖ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జూ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. జూను 6,300 మంది సందర్శించడం వల్ల సుమారు నాలుగు లక్షల వెయ్యి రూపాయల ఆదాయం వచ్చినట్టు క్యూరేటర్ డాక్టర్ నందినీ సలారియా తెలిపారు. కాగా ముడసర్లోవ, కంబాలకొండ ప్రాంతాలు కూడా కిటకిటలాడాయి.