తాజంగి రిజర్వాయర్‌ వద్ద జిప్‌లైన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-28T05:02:13+05:30 IST

ప్రముఖ పర్యాటక కేంద్రం తాజంగి రిజర్వాయర్‌ వద్ద జిప్‌లైన్‌ క్రీడను ఆదివారం ప్రారంభించారు. ఆంధ్ర కాశ్మీర్‌ లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి రిజర్వాయర్‌ వద్ద ఐటీడీఏ సహకారంతో స్థానిక పర్యాటక వికాస్‌ సభ్యులు గత ఏడాది జిప్‌ లైన్‌ను ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే.

తాజంగి రిజర్వాయర్‌ వద్ద జిప్‌లైన్‌ ప్రారంభంచింతపల్లి, డిసెంబంరు 27: ప్రముఖ పర్యాటక కేంద్రం తాజంగి రిజర్వాయర్‌ వద్ద జిప్‌లైన్‌ క్రీడను ఆదివారం ప్రారంభించారు. ఆంధ్ర కాశ్మీర్‌ లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి రిజర్వాయర్‌ వద్ద ఐటీడీఏ సహకారంతో స్థానిక పర్యాటక వికాస్‌ సభ్యులు గత ఏడాది జిప్‌ లైన్‌ను ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా జిప్‌లైన్‌ను నిర్వాహకులు అనుమతించలేదు. తాజాగా ఐటీడీఏ అనుమతి ఇవ్వడంతో పర్యాటక వికాస్‌ సభ్యులు జిప్‌లైన్‌ క్రీడను రెండు రోజుల క్రితం ప్రారంభించారు.

Updated Date - 2020-12-28T05:02:13+05:30 IST