ఆన్‌లైన్‌ ద్వారా యువజనోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-19T05:50:24+05:30 IST

యువజనోత్సవాలు ఈ ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్లు యువజన విభాగం ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు.

ఆన్‌లైన్‌ ద్వారా యువజనోత్సవాలు

మహారాణిపేట, నవంబరు 18: యువజనోత్సవాలు ఈ ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్లు యువజన విభాగం ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. 2020-21 యువజనోత్సవంలో భాగంగా 15 నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులకు పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత, గ్రూపు విధానంలో నిర్వహించే ఈ పోటీలకు ఔత్సాహికులు ఈనెల 27వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. యువత ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.  


Updated Date - 2020-11-19T05:50:24+05:30 IST