యూత్‌ ఎంగేజ్‌మెంట్‌ పోస్టరు ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-07-28T10:06:04+05:30 IST

యూత్‌ ఎంగేజ్‌మెంట్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మానవ జాతి, భూగ్రహంపై మానవజాతి ..

యూత్‌ ఎంగేజ్‌మెంట్‌ పోస్టరు ఆవిష్కరణ

విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి) : యూత్‌ ఎంగేజ్‌మెంట్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మానవ జాతి, భూగ్రహంపై మానవజాతి మనుగడ అనే అంశంపై చర్చించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. అంతర్జాతీయ యూత్‌ డే సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. సోమవారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఖాజా రహ్మతుల్లా, యూత్‌ ఎంగేజ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ బాజీ, సభ్యులు శ్వేత, అబ్దుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-28T10:06:04+05:30 IST