విశాఖ ఏజెన్సీలో యువకుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2020-07-19T14:33:34+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది.

విశాఖ ఏజెన్సీలో యువకుడు దారుణ హత్య

విశాఖపట్నం : జిల్లాలోని ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఏజెన్సీ ప్రాంతంలో ఓ యువకుడ్ని కొందరు గుర్తు తెలియని దుండుగులు దారుణంగా హత్య చేశారు. పెడబయలు మండలం గంపరాయి మలుపు వల్లంగి వద్ద ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని రామకృష్ణ (21)గా స్థానికులు గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-19T14:33:34+05:30 IST