ఎలమంచిలి టీడీపీ ఇన్‌చార్జిగా ప్రగడ?

ABN , First Publish Date - 2020-12-15T06:38:50+05:30 IST

ఎలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా ప్రగడ నాగేశ్వరరావు పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్టు తెలిసింది.

ఎలమంచిలి టీడీపీ ఇన్‌చార్జిగా ప్రగడ?


రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా రాజానరమేష్‌

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా ప్రగడ నాగేశ్వరరావు పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్టు తెలిసింది. ఈనెల 17న ఎలమంచిలిలో నిర్వహించనున్న సమావేశంలో ప్రగడ పేరును ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. అలాగే ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన రాజానరమేష్‌ను రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమించారు. ఈ విషయం కూడా అదే సమావేశంలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 17న ఎలమంచిలిలో నిర్వహించనున్న సమావేశానికి మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కమిటీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీ శ్వరరావు, తదితరులు హాజరుకానున్నారు. జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

Updated Date - 2020-12-15T06:38:50+05:30 IST