-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Yarada Dargah under the control of the Wakf Board
-
వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి యారాడ దర్గా
ABN , First Publish Date - 2020-12-19T05:37:32+05:30 IST
యారాడ కొండపై ఉన్న దర్గా శుక్రవారం నుంచి వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి వెళ్లింది. ఈ దర్గాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మల్కాపురం, డిసెంబర్ 18 : యారాడ కొండపై ఉన్న దర్గా శుక్రవారం నుంచి వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి వెళ్లింది. ఈ దర్గాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ నలుమూలల నుంచి ప్రముఖులతో పాటు అన్ని మతాల ప్రజలు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో లైట్ హౌస్‌ను ఆనుకుని ఇది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని వక్ఫ్‌బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని సూచించడంతో శుక్రవారం వక్ఫ్ బోర్డు అధికారులు ఇక్కడికి వచ్చి హుండీలకు సీల్ వేశారు. ప్రస్తుత నిర్వాహకులతో మాట్లాడి ఇది ఇప్పటి నుంచి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి అహ్మద్ మొహీద్దీన్‌తో పాటు నిర్వహక సేవకులు అబ్దుల్ ఖయ్యూం, బుజ్జి, అమర్, రెడ్డి, షఫీ పాల్గొన్నారు.