ఉపాధి లేదు..కూలీల ఆకలి కేకలు
ABN , First Publish Date - 2020-03-27T09:52:22+05:30 IST
జాతీయ ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు చేస్తున్న కూలీలకు ఆరు వారాల నుంచి కూలి డబ్బులు అందడం లేదు. దీంతో వ్ర ఆర్థిక
ఆరు వారాల నుంచి ఆగిన చెల్లింపులు
రూ.38.45 కోట్లకు చేరిన బకాయిలు
పనులు ఆపేసిన అధికారులు
లాక్‌డౌన్‌తో మరిన్ని ఇబ్బందులు
ఏప్రిల్ మొదటి వారంలో చెల్లింపులంటున్న అధికారులు
అనకాపల్లి, మార్చి 26:
జాతీయ ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు చేస్తున్న కూలీలకు ఆరు వారాల నుంచి కూలి డబ్బులు అందడం లేదు. దీంతో వ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో గత ఆదివారం నుంచి డ్వామా అధికారులు పనులు ఆపేయడం, చేతిలో డబ్బులు లేకపోవడం, లాక్ డౌన్ కారణంగా ఇతరత్రా పనులు కూడా ఆగిపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూలీలు వాపోతున్నారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,73,846 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరికి ఆరు వారాల నుంచి కూలి డబ్బులు అందడం లేదు. గత నెల రెండో వారంలో డబ్బులు అందాయని కూలీలు చెబుతుండగా, గత నెల 26వ తేదీ వరకు చెల్లింపులు జరిపినట్టు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 21వ తేదీ వరకు పనులు చేసిన కూలీలకు 38 కోట్ల 45 లక్షల 81 వేల 157 రూపాయలు చెల్లించాల్సి ఉంది. డుంబ్రిగుడ మండలంలోని కూలీలకు అత్యధికంగా రూ.2,36,13,714 బకాయిలు ఉన్నాయి. 16 మండలాల్లో కోటి రూపాయలపైబడి చెల్లించాల్సి ఉంది. కూలి డబ్బులు వెంటనే చెల్లించేలా ఉన్నతాధికారులు చూడాలని ఉపాధి కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఉపాధి కూలీలకు ఏప్రిల్ మొదటి వారంలో చెల్లింపులు జరుగుతాయని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ సందీప్ తెలిపారు.
మండలాల వారీగా కూలీలు, అందాల్సిన సొమ్ము
మండలం కూలీలు బకాయి సొమ్ము
అనకాపల్లి 15,673 రూ.1,36,79,755
ఆనందపురం 13,100 రూ.1,02,79,775
అనంతగిరి 7,118 రూ.75,51,690
అరకులోయ 12,878 రూ.1,30,08,794
అచ్యుతాపురం 3,459 రూ.25,10,232
భీమునిపట్నం 7,518 రూ.57,48,840
బుచ్చెయ్యపేట 15,116 రూ.1,07,28,669
చీడికాడ 8,509 రూ.65,47,977
చింతపల్లి 18,434 రూ.1,79,26,227
చోడవరం 9,006 రూ.64,84,379
దేవరాపల్లి 8,905 రూ.60,17,229
డుంబ్రిగుడ 23,021 రూ.2,36,13,714
జి.మాడుగుల 7,805 రూ.73,06,444
గొలుగొండ 15,848 రూ.1,52,30,071
గూడెంకొత్తవీధి 4,658 రూ.38,24,087
హుకుంపేట 7,600 రూ.70,84,893
కె.కోటపాడు 12,251 రూ.91,93,410
కశింకోట 9,435 రూ.60,98,667
కోటవురట్ల 17,181 రూ.1,04,29,151
కొయ్యూరు 10,554 రూ.1,01,62,906
మాడుగుల 12,659 రూ94,30,242
మాకవరపాలెం 22,248 రూ.1,66,72,617
మునగపాక 10,257 రూ.72,42,981
ముంచింగిపుట్టు 15,800 రూ.1,77,69,286
నక్కపల్లి 18,364 రూ.1,62,54,114
నర్సీపట్నం 9,258 రూ.67,83,875
నాతవరం 15,700 రూ.1,13,07,603
పాడేరు 10,402 రూ.1,04,69,288
పద్మనాభం 13,488 రూ.88,62,292
పరవాడ 2,997 రూ.26,24,907
పాయకరావుపేట 5,814 రూ.34,06,900
పెదబయలు 16,709 రూ.1,91,26,341
పెందుర్తి 5,967 రూ.40,70,931
రాంబిల్లి 10,380 రూ.65,77,039
రావికమతం 21,183 రూ.1,24,64,701
రోలుగుంట 20,451 రూ.1,37,19,518
ఎస్.రాయవరం 14,271 రూ.96,07,530
సబ్బవరం 11,944 రూ.92,97,362
ఎలమంచిలి 7,885 రూ.54,66,720
మొత్తం 4,73,846 రూ.38,45,81,157
రూ.6 వేలు అందాలి...దేవర లక్ష్మి, ఉపాధి కూలి, మునగపాక
ఆరు వారాల నుంచి ఉపాధి కూలి సొమ్ము అందలేదు. నాకు సుమారు ఆరు వేల రూపాయలు రావాల్సి ఉంది. జనవరి ఒకటో వారంలో బడ్జెట్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి మొదటి వారంలో బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకున్నాను. మళ్లీ ఇంతవరకు కూలి డబ్బులు అందలేదు.
బకాయిలు వెంటనే ఇవ్వాలి..శీరా రమణ, మారేడుపూడి, అనకాపల్లి మండలం
కరోనా వైరస్ కారణంగా గత ఆదివారం నుంచి పనులు ఆపేశారు. ఉపాధి పనుల కూలి డబ్బులు చేస్తే ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో నెల రోజుల వరకు ఉపాధి పనులు జరగవనిపిస్తున్నది. బయట కూడా కూలి పనులు లేవు. అధికారులు స్పందించి కూలి బకాయిలు ఇప్పించాలి.