నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2020-12-30T05:11:51+05:30 IST
నాయీబ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని నాయీబ్రాహ్మణ వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య తెలిపారు.
నాయీబ్రాహ్మణ వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య
ఎన్‌ఏడీ జంక్షన్, డిసెంబరు 29: నాయీబ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని నాయీబ్రాహ్మణ వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయన పంజాబ్ హోటల్ జంక్షన్‌లోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేవాలయాల్లో పని చేస్తున్న క్షురకులు, వాయిద్య కళాకారుల ఉద్యోగ భద్రతకు కృషి చేస్తానన్నారు. త్వరలో నాయీబ్రాహ్మణులకు రూ.20 వేల కోట్ల రుణాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. కార్పొరేట్ సెలూన్లకు దీటుగా కులవృత్తిలో కొనసాగుతున్న నాయీబ్రాహ్మణులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో నాయీ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరవ పైడిరాజు, నగర అధ్యక్షుడు చల్లపల్లి అప్పలరాజు, కార్యదర్శి దేవగుప్తపు రమేశ్, కార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.