పాము కాటుకు మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-08T05:03:23+05:30 IST

పాము కాటుకు ఓ మహిళ మృతి చెందింది. పెదముషిడివాడలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

పాము కాటుకు మహిళ మృతి
మృతి చెందిన వరలక్ష్మి

లంకెలపాలెం, నవంబరు 7: పాము కాటుకు ఓ మహిళ మృతి చెందింది. పెదముషిడివాడలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వరలక్ష్మి(40) ఇంటి పనులు చేస్తుండగా వెనుక నుంచి పాము వచ్చి కాటేసింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం అగనంపూడి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ వరలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. పరవాడ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-08T05:03:23+05:30 IST