రాష్ట్రస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీల విజేత తూ.గో. జట్టు
ABN , First Publish Date - 2020-12-29T05:54:45+05:30 IST
నాలుగో రాష్ట్రస్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ చాంపియన్‌షిప్ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా జట్టు అద్భుతంగా రాణించి, ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.
పాయకరావుపేట, డిసెంబరు 28 : నాలుగో రాష్ట్రస్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ చాంపియన్‌షిప్ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా జట్టు అద్భుతంగా రాణించి, ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇక్కడి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న పోటీలు ఆదివారం రాత్రి ముగి శాయి. ద్వితీయ, తృతీయ స్థానాలను విశాఖ, కడప జిల్లాల జట్లు కైవసం చేసుకున్నాయి. వీరంతా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అనంతరం ఏపీ థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అనందాచారి తదితరులు విజేతలకు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందజేశారు. అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ జె.ఫియాజ్, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.రామకృష్ణతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.