అప్పన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా?

ABN , First Publish Date - 2020-12-26T04:52:14+05:30 IST

అన్యాయాలు, అక్రమాలు, అక్రమ ఆస్తులు సంపాదించలేదని సింహాద్రి అప్పన్న సాక్షిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రమాణం చేస్తారా అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు.

అప్పన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా?
సమావేశంలో మాట్లాడుతున్న గుడివాడ అమర్‌నాథ్‌

వెలపూడికి ఎమ్మెల్యే గుడివాడ సవాల్‌ 


మద్దిలపాలెం, డిసెంబరు 25: అన్యాయాలు, అక్రమాలు, అక్రమ ఆస్తులు సంపాదించలేదని సింహాద్రి అప్పన్న సాక్షిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రమాణం చేస్తారా అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తన చాలెంజ్‌ను స్వీకరించడానికి వెలగపూడి సిద్ధమో కాదో చెప్పాలన్నారు. 18 నెలల్లో నగర పరిసర ప్రాంతాల్లో 171 ఎకరాలను టీడీపీ నేతల కబంధ హస్తాల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో విజయసాయిరెడ్డి కృషి ఉందన్నారు. విశాఖ భూములపై వారం, పదిరోజుల్లో సిట్‌ నివేదిక వస్తుందని అందులోని ప్రతి ఒక్కరిపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T04:52:14+05:30 IST