సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-29T05:42:06+05:30 IST

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు.

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
ఇళ్ల స్థల పట్టాలు అందిస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

పరవాడ, డిసెంబరు 28: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు. మండలంలో సోమవారం బొద్దపువానిపా లెం, పరవాడ, వెన్నెలపాలెం, పి.భోనంగి, కలపాక, గొర్లెవానిపాలెం గ్రామాల్లో లబ్ధిదారులకు ఆయన ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఎన్‌.కోటేశ్వరరావు, వైసీపీ నేతలు  పైలా శ్రీనివాసరావు, చుక్క రామునాయుడు, అప్పలనాయుడు,  సన్యాసిరాజు, జయరాం, చిన్నారావు, అప్పారావు, కనకారావు, గోపాలకృష్ణ,  సన్యాసిరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:42:06+05:30 IST