రేకుల షెడ్డు కూలి వెల్డర్‌ మృతి

ABN , First Publish Date - 2020-03-21T10:21:43+05:30 IST

గాజువాక సమీపంలోని మింది వద్ద శుక్రవారం 30 అడుగుల రేకుల షెడ్డు పడిపోవడంతో దానిపై వెల్డింగ్‌ పను

రేకుల షెడ్డు కూలి వెల్డర్‌ మృతి

తాటిచెట్లపాలెం/ అక్కిరెడ్డిపాలెం, మార్చి 20 : గాజువాక సమీపంలోని మింది వద్ద శుక్రవారం 30 అడుగుల రేకుల షెడ్డు పడిపోవడంతో దానిపై వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తున్న కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 


మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌ శ్రీనివాసనగర్‌కు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (47) స్థానికంగా వెల్డింగ్‌ పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య ఫరీదా, కుమార్తె బహీరా ఉన్నారు. శుక్రవారం గాజువాక సమీపంలోని మింది ప్రాంతంలో ఉన్న ఏటీ రాయుడు గొడౌన్స్‌ వద్ద షిట్‌ ఫిటింగ్‌ పనులు చేస్తుండగా రేకుల షెడ్‌ విరిగిపోవడంతో ముప్ఫై అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో తల భూమికి నేరుగా తగలడంతో ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ప్రాంతమంతా రక్తమోడడంతో భయానక వాతావరణం నెలకొంది. తోటి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ యజమాని మృత్యువాడ పడడంతో తమకు ఇక దిక్కెవరు అంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందరినీ ఆవేదనకు గురి చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-03-21T10:21:43+05:30 IST